నవ్వుల్‌.. నవ్వుల్‌...!

అమ్మ: అబ్బా పింకీ.. ఎందుకు ఊరికే ఏడుస్తున్నావ్‌?....

Published : 24 Mar 2022 01:35 IST

అదన్నమాట కారణం!

అమ్మ: అబ్బా పింకీ.. ఎందుకు ఊరికే ఏడుస్తున్నావ్‌?
పింకి: అలా ఏడిస్తేనే కదా.. నువ్వు నన్ను పట్టించుకుంటున్నావు.
అమ్మ: ఆఁ!!

చూస్తే కానీ నమ్మొద్దు!

టీచర్‌: ఏంటి బంటీ... మాస్క్‌ పెట్టుకోమంటే కరోనా లేదు.. గిరోనా లేదు. అంతా మూఢనమ్మకం అంటున్నావంట?
బంటి: అవును టీచర్‌.
టీచర్‌: ఏ.. ఎందుకలా?
బంటి: కళ్లారా చూస్తేనే కానీ దేన్నీ నమ్మొద్దు అని మీరే మొన్న చెప్పారు కదా టీచర్‌. కరోనా కనిపించడం లేదు కాబట్టి అది మూఢనమ్మకమే మరి!
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని