నవ్వుల్‌.. నవ్వుల్‌..

రింకూ : రిక్కీ.. ఏంటి దిగులుగా కనిపిస్తున్నావు? రిక్కీ : అవును రింకూ..

Published : 27 Mar 2022 00:46 IST

తొక్కితే కదా..

రింకూ : రిక్కీ.. ఏంటి దిగులుగా కనిపిస్తున్నావు?
రిక్కీ : అవును రింకూ..
రింకూ : ఏంటో చెప్పు..
రిక్కీ : మరేం లేదు రింకూ.. రోజూ 3 కిలోమీటర్లు సైకిల్‌ మీదనే స్కూలుకు వస్తున్నా కదా..
రింకూ : హ అవును. అయితే..!
రిక్కీ : కేజీ బరువు కూడా తగ్గలేదు నేను..
రింకూ : అవునా?
రిక్కీ : వెనక స్టాండ్‌ మీద సరిగ్గానే కూర్చుంటున్నా మరి!
రింకూ : ఆ..!!

చెప్తారు కానీ.. చేయరంతే!

అమ్మ : ఏమైంది చింటూ.. అంత చిరాకు పడుతున్నావు?
చింటు : మా టీచర్‌ అస్సలు మాట మీద నిలబడటం లేదమ్మా..
అమ్మ : అసలు విషయం ఏంటో   చెప్పు?
చింటు : ‘హోంవర్క్‌ చేయకపోతే ఇంటికి పంపిస్తా’అని రోజూ చెప్తారు కానీ ఒక్కరోజు కూడా పంపడం లేదమ్మా..
అమ్మ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని