నవ్వుల్‌.. నవ్వుల్‌...

టీచర్‌: పింకీ.. నీ హోం వర్క్‌ ఏది?

Updated : 28 Mar 2022 06:33 IST

వదిలేసి వచ్చేశా!

టీచర్‌: పింకీ.. నీ హోం వర్క్‌ ఏది?

పింకి: ‘హోం వర్క్‌’ కదా అని ఇంట్లోనే వదిలేసి వచ్చేశా టీచర్‌.

టీచర్‌: ఆఁ!!

అవును సుమీ!

నాన్న: వేలెడంత లేవు కానీ... నీ అల్లరికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.

బంటి: (మౌనంగా ఉంటాడు)

నాన్న: నేను ఇంతలా అరుస్తుంటే అలా బెల్లంకొట్టిన రాయిలా ఉన్నావేం.

బంటి: నేను అబద్ధాలు ఆడేవారితో మాట్లాడను.

నాన్న: ఇప్పుడు నేనేం అబద్ధం ఆడాను బంటీ!

బంటి: ‘వేలెడంత లేవు...’ అన్నారు కదా.. అసలు ఎవరైనా వేలెడంత ఉంటారా?!

నాన్న: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని