నవ్వుల్‌.. నవ్వుల్‌..

టీచర్‌: నారు పోసినవాడే నీరు పోస్తాడు... ఇలాంటి మరో సామెత చెప్పు టింకూ!

Published : 29 Mar 2022 00:46 IST

సరిపోయిందిపో..

టీచర్‌: నారు పోసినవాడే నీరు పోస్తాడు... ఇలాంటి మరో సామెత చెప్పు టింకూ!
టింకు: పాఠం చెప్పినవారే.. పరీక్షా రాయాలి.
టీచర్‌: ఆఁ!!


అప్పుడు ఇవేమీ లేవు మరి!

అమ్మ: నేను నీ వయసులో ఉన్నప్పుడు నాకు ఏ సబ్జెక్టులో అయినా నూటికి తొంభైకిపైగా మార్కులొచ్చేవి తెలుసా?
పింకీ: అప్పట్లో స్మార్ట్‌ఫోన్లు లేవు. వీడియోగేమ్స్‌ లేవు. యూట్యూబ్‌ కూడా లేదు. ఏం చేయాలో తోచక బోర్‌కొట్టి ఇక తప్పక చదివి ఉంటావు. అందుకే మార్కులు అలా వచ్చి ఉంటాయి. అందులో నీ గొప్పేం ఉంది అమ్మా!
అమ్మ: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని