Published : 31 Mar 2022 01:35 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..

బస్సు లేదు మరి!

టీచర్‌ : చిట్టీ...! బడికి ఎందుకు ఆలస్యంగా వచ్చావు?
చిట్టి : బడికి బయలుదేరేముందు చూస్తే.. మా నాన్న బండి పంక్చర్‌ అయింది టీచర్‌..  
టీచర్‌ : అయితే, బస్సులో రావాల్సింది!
చిట్టి : మా నాన్న దగ్గర బస్సు లేదు టీచర్‌..
టీ చర్‌ : ఆఁ!!

ఇప్పటికైనా తెలిసిందా అంకుల్‌!

అంకుల్‌: ఏంటి చింటూ... నేను టిఫిన్‌ చేస్తుంటే, మీ కుక్క నా వైపే చూస్తోంది? దానికి తినడానికి ఏమీ పెట్టలేదా?
చింటు: దానికి దాని ప్లేట్‌లో పెడితేనే తినడం అలవాటు.
అంకుల్‌: మరింకేం పాపం.. దానికి బాగా ఆకలిగా ఉన్నట్లుంది. దానికేదైనా తినడానికి పెట్టు మరి!
చింటు:  ముందు మీరు తినేసి, ఆ ప్లేట్‌ ఇస్తే.. దానిలో పెడతా.
అంకుల్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు