Published : 05 Apr 2022 00:38 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ఎవరెక్కువ ఇస్తే వాళ్లే!
అంకుల్‌: చింటూ...! నీకు మీ అమ్మ అంటే ఇష్టమా..? మీ నాన్న అంటే ఇష్టమా?
చింటు: ఇద్దరూ ఇష్టమే.. కాకపోతే.. ఎవరెక్కువ పాకెట్‌ మనీ ఇస్తే వాళ్లు కాస్త ఎక్కువ ఇష్టం.
అంకుల్‌: ఆఁ!!

నాన్న చెప్పారని!
అమ్మ: ఏంటి బంటీ.. నీ స్కూల్‌ బ్యాగ్‌ స్టోర్‌రూంలో పడేశావ్‌?
బంటి: పనికిరాని వస్తువులన్నీ స్టోర్‌రూంలో పడేస్తే ప్రశాంతంగా ఉంటుందని నిన్న నీతో నాన్న చెప్పారు కదా. అందుకే నా స్కూల్‌ బ్యాగ్‌, పుస్తకాలు అన్నీ స్టోర్‌రూంలో పడేశా. ఇప్పుడు నిజంగానే నాకు ప్రశాంతంగా ఉంది అమ్మా!  
అమ్మ: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని