Updated : 07 Apr 2022 00:14 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

తెలివైన వాడే!

టీచర్‌: నువ్వు పొరపాటున ఓ పెద్దాయన కాలు తొక్కితే ఏం చేస్తావు బంటీ?

బంటి: వెంటనే సారీ చెబుతా టీచర్‌.

టీచర్‌: నీ ప్రవర్తనకు మెచ్చుకుని ఆ పెద్దమనిషి నీకు ఓ చాక్లెట్‌ ఇచ్చారనుకో.. నువ్వేం చేస్తావు?

బంటి: వెంటనే రెండో కాలు కూడా తొక్కేస్తా టీచర్‌.

టీచర్‌: ఆఁ!!

అంకుల్‌ అబద్ధం చెప్పారేమో!

చింటు: నాన్నా.. నాన్నా.. మనకు టీవీ అమ్మిన అంకుల్‌ ఇది కలర్‌ టీవీ అని మనకు అబద్ధం చెప్పాడు.
నాన్న: లేదే.. అది కలర్‌ టీవీనే...

చింటు: లేదు నాన్నా... ఇదిగో చూడండి.. జీబ్రాలన్నీ బ్లాక్‌అండ్‌ వైట్‌లోనే కనిపిస్తున్నాయి.
నాన్న: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని