Published : 09 Apr 2022 02:52 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..

పెద్ద చిక్కే!

అనిల్‌ : ఏంటి వినీల్‌.. నిన్న ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కి వెళ్లి.. ఏమీ తినకుండానే వచ్చేశావట?

వినీల్‌ : అవును రా.. అలిగాను..

అనిల్‌ : ఏ.. ఎందుకు?

వినీల్‌ : మరేం లేదు.. నూడుల్స్‌ ఆర్డర్‌ చేస్తే, అన్నీ చిక్కులు చిక్కులుగా సర్వ్‌ చేశారు. డబ్బులు కడుతున్నాం కదా.. కాస్త చిక్కులు తీసి ఇవ్వాలని కూడా తెలియదు వాళ్లకు..

అనిల్‌ : ఆ..!!

ఎగురుతాయనుకున్నాడు!

అమ్మ : ఏంటి రీతూ.. ఫ్రిజ్‌లోని బటర్‌ ప్యాకెట్లన్నీ బయట పడేసి ఉన్నాయి?

రీతు : నేను కాదమ్మా.. తమ్ముడు..

అమ్మ : ఎందుకు పడేశాడు?

రీతు : నేను ఎంత చెప్పినా వినకుండా, వాటిలోంచి బటర్‌ఫ్లైస్‌ వస్తాయేమోనని కిటికీలోంచి బయటకు విసిరాడమ్మా..

అమ్మ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు