Published : 14 Apr 2022 00:55 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌...!

నా తప్పేం లేదు మరి!

టీచర్‌: హోం వర్క్‌ మీ నాన్నతో చేయించొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి చింటూ!

చింటు: ఇందులో నా తప్పేమీ లేదు టీచర్‌. అంతా మా అమ్మ వల్లే!

టీచర్‌: మధ్యలో మీ అమ్మ ఏం చేశారు?

చింటు: మా నాన్న ఇంటి పని చేయకుంటే మా అమ్మ అస్సలు ఊరుకోరు. అందుకే నా ‘హోం వర్క్‌’ను కూడా నేను వద్దన్నా వినకుండా మా నాన్నే చేస్తున్నారు టీచర్‌.

టీచర్‌: ఆఁ!!  

ఎందుకలా నవ్వుతున్నావు?

టీచర్‌: కిట్టూ.. ఎందుకలా క్లాసు వినకుండా బిగ్గరగా నవ్వుతున్నావు?

కిట్టు: నేను బలహీనంగా ఉన్నా టీచర్‌.

టీచర్‌: నేనేం అడుగుతున్నా.. నువ్వేం చెబుతున్నావు?

కిట్టు: సంతోషం సగం బలం అని నిన్న మీరే చెప్పారు కదా టీచర్‌. అందుకే బలం కోసం నవ్వుతున్నా...!

టీచర్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు