నవ్వుల్‌.. నవ్వుల్‌...!

టీచర్‌: బానిస అంటే అర్థం తెలుసా కిట్టూ?

Published : 15 Apr 2022 00:28 IST

అయ్య బాబోయ్‌!

టీచర్‌: బానిస అంటే అర్థం తెలుసా కిట్టూ?
కిట్టు: ఓ.. తెలుసు టీచర్‌.

టీచర్‌: గుడ్‌.. అయితే చెప్పు.
కిట్టు: నాన్న టీచర్‌.

టీచర్‌: అదేంటి కిట్టూ?
కిట్టు: మరి మా అమ్మ చెప్పిన పనులన్నీ కిమ్మనకుండా మా నాన్న చేస్తారు మరి.

టీచర్‌: ఆఁ!!

నిజమే సుమా!

చంటి: చింటూ నీకో రహస్యం చెప్పనా?
చింటు: ఊ... చెప్పు చంటీ!

చంటి: చెప్పను చింటూ...
చింటు: ఏ.. ఎందుకు?

చంటి: అది రహస్యం అన్నానుగా.. నీకు చెబితే అది రహస్యం ఎలా అవుతుంది?
చింటు: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని