Published : 16 Apr 2022 00:54 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ముందు జాగ్రత్త మరి..

చైతు : మావయ్యా.. మావయ్యా.. ఇప్పుడు నేను చెప్పే జోక్‌ వింటే నువ్వు కళ్లు తిరిగి పడిపోతావు..

మావయ్య : అవునా.. చెప్పు చూద్దాం అయితే..?

చైతు : వద్దులే.. నవ్వీ నవ్వీ నువ్వు కిందపడిపోతే నేనొక్కదాన్నే నిన్ను తీసుకెళ్లలేను..

మావయ్య : ఆ..!!

పేరులోనే ఉన్నదంతా..!

టీచర్‌ : రాజూ.. గజఈతగాడు అంటే ఎవరో తెలుసా?

రాజు : ఓ.. తెలుసు టీచర్‌..

టీచర్‌ : అయితే, అందరికీ వినిపించేలా గట్టిగా చెప్పు..

రాజు : గజం దూరం మాత్రమే ఈదగలిగే వారిని గజఈతగాడు అంటారు టీచర్‌..

టీచర్‌ : ఆ..!!

అలా అర్థమైందా?

టీచర్‌ : రాణీ.. వేసవిలో విహారయాత్రలకు వెళ్లదగిన కొన్ని ప్రదేశాల పేర్లు చెప్పు?

రాణి : ఐసీఐసీఐ, యాక్సిస్‌, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలాంటివి టీచర్‌..

టీచర్‌ : నేను అడిగిన ప్రశ్నేంటి? నీ సమాధానాలేంటి?

రాణి : ఎప్పుడూ ఏసీ ఆన్‌లో ఉండే.. చల్లని ప్రదేశాలు బ్యాంకులే కదా టీచర్‌..

టీచర్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు