నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నాన్న: నీకు ఎన్ని మార్కులు వచ్చాయి చింటూ! చింటు: నాకు మార్కుల్ని మించి వచ్చాయి నాన్నా!...

Updated : 18 Apr 2022 05:59 IST

అంతకు మించి...
నాన్న: నీకు ఎన్ని మార్కులు వచ్చాయి చింటూ!
చింటు: నాకు మార్కుల్ని మించి వచ్చాయి నాన్నా!
నాన్న: ఓ.. అవునా గుడ్‌.. ఇంతకీ ఏంటవి?
చింటు: రిమార్కులు నాన్నా!
నాన్న: ఆఁ!!
అమ్మమ్మ చెప్పింది మరి!
టీచర్‌: నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు బంటీ!
బంట ¨: నేను చెడ్డవాణ్ని అవుతా టీచర్‌.
టీచర్‌: ఏ.. ఎందుకలా?
బంటి: ‘ఆ దేవుడు మంచి వాళ్లకే కష్టాలు పెడతాడు’ అని మా అమ్మమ్మ పక్కింటి ఆంటీతో అంది. నాకు కష్టాలు వద్దు టీచర్‌. అందుకే నేను చెడ్డవాణ్ని అవుతా.
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని