నవ్వుల్‌.. నవ్వుల్‌...!

టీచర్‌: నీకు ఇష్టమైన బుక్‌ ఏంటి చింటూ?

Updated : 19 Apr 2022 04:18 IST

అదీ పుస్తకమేనా!

టీచర్‌: నీకు ఇష్టమైన బుక్‌ ఏంటి చింటూ?
చింటు: ఫేస్‌బుక్‌ టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


శిక్షణ ఇవ్వడం తప్పా!

అమ్మ: బంటీ.. తమ్ముడిని ఎందుకు కొడుతున్నావ్‌?
బంటి: నేను ఊరికే కొట్టడం లేదమ్మా!
అమ్మ: మరి?
బంటి: భవిష్యత్తులో వచ్చే కష్టాలకు ఇప్పటి నుంచే అలవాటు చేస్తున్నానమ్మా!
అమ్మ: ఆఁ!!


పేర్లు మార్చేయాలి!

విక్కీ : మావయ్యా.. మావయ్యా.. పెట్రోల్‌, డీజిల్‌కు నేనో కొత్త పేరు కనిపెట్టానోచ్‌..
మావయ్య : అవునా.. ఏంటది?
విక్కీ : పుష్ప..
మావయ్య : అది సినిమా పేరు కదా?  
విక్కీ : అవును.. ‘తగ్గేదే లే’ అంటూ ప్రతి రోజూ పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి కదా..
మావయ్య : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని