నవ్వుల్‌.. నవ్వుల్‌...!

ష్‌.. గప్‌చుప్‌!టీచర్‌: నువ్వు పెద్దయ్యాక ఏ వృత్తిలో స్థిరపడతావు టింకూ?

Updated : 20 Apr 2022 00:55 IST

ష్‌.. గప్‌చుప్‌!

టీచర్‌: నువ్వు పెద్దయ్యాక ఏ వృత్తిలో స్థిరపడతావు టింకూ?
టింకు: ష్‌.. అది వృత్తి రహస్యం. నేను చెప్పను టీచర్‌.
టీచర్‌: ఆఁ!!

ఆరోగ్యానికి మంచిదని!

ఆంటీ: చింటూ.. ఈ రోజు మీది ఏం కూర?
చింటు: ఆకుకూర ఆంటీ.
ఆంటీ: అదేంటి.. మీ అమ్మ పప్పు అని చెప్పారు మరి.
చింటు: అవును పప్పే ఆంటీ.
ఆంటీ: మరి నాకు అబద్ధం ఎందుకు చెప్పావు?
చింటు: ఆరోగ్యానికి మంచిదని!
ఆంటీ: ఏంటి.. అబద్ధం ఆడటమా?
చింటు: కాదు ఆంటీ.. ఆకుకూర!
ఆంటీ: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని