నవ్వుల్‌.. నవ్వుల్‌...!

నందూ.. నువ్వు అబద్ధాలు ఆడతావా?...

Published : 21 Apr 2022 00:29 IST

నిజమే చెప్పాను మరి!

టీచర్‌: నందూ.. నువ్వు అబద్ధాలు ఆడతావా?
నందు: ‘నేను నిజం మాత్రమే చెబుతాను’ అనే అబద్ధం మాత్రం ఆడను టీచర్‌.
టీచర్‌: ఆఁ!!

ఎండాకాలం కదా అని!

అంకుల్‌: బంటీ.. ఎండలో ఏం చేస్తున్నావ్‌?
బంటి: వేసవికాలం కదా అంకుల్‌... బాగా చెమట వస్తోంది. అందుకే ఎండలో ఆరబెట్టుకుంటున్నా.
అంకుల్‌: ఆఁ!!

మూడు కాలాలే కదా!

అమ్మ: ఏంటి పింకీ.. తెగ ఆలోచిస్తున్నావ్‌..?
పింకీ: నిన్న నన్ను అమ్మమ్మ ‘పదికాలాల పాటు చల్లగా ఉండు తల్లీ’ అని ఆశీర్వదించింది.
అమ్మ: అందులో ఆలోచించడానికి ఏముంది?
పింకీ: అది కాదు అమ్మా! మనకు వేసవికాలం, శీతాకాలం, వానాకాలం అని మూడు కాలాలే కదా.. మరి మిగిలిన ఏడు కాలాలు ఏంటా? అని ఆలోచిస్తున్నా.
అమ్మ: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని