Updated : 23 Apr 2022 00:35 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

దటీజ్‌ పింకీ!

టీచర్‌ : పవనం అంటే ఏంటో చెప్పు పింకీ..
పింకి: ‘ప’ అనే పేరుగల వనం టీచర్‌..
టీచర్‌ : ఆఁ!!

పెద్ద చదువే!

టీచర్‌ : పిల్లలూ.. మీరంతా పెద్దయ్యాక ఏం చదువుదామని అనుకుంటున్నారు?
రాజు : నేను ఇంజినీరింగ్‌ చదువుతా టీచర్‌..
నిక్కి : నేను డాక్టర్‌ అవుతా..

టీచర్‌ : వెరీ గుడ్‌.. నీ సంగతేంటి వెంకీ?
వెంకి : నేను పది వరకే చదువుతా టీచర్‌..

టీచర్‌ : ఏ.. ఎందుకలా?
వెంకి : మా అమ్మ నన్ను ‘పది’ తర్వాత నిద్రపొమ్మని చెప్పింది టీచర్‌..
టీచర్‌ : ఆ..!!

అయ్య బాబోయ్‌..

టీచర్‌ : రింకూ.. ‘వడదెబ్బ’ అంటే ఏంటో తెలుసా?
రింకు : ఓ.. తెలుసు టీచర్‌..

టీచర్‌ : ఏంటో అందరికీ వినిపించేలా నిల్చొని చెప్పు..
రింకు : వడతో కొడితే తగిలే దెబ్బను వడదెబ్బ అని అంటారు టీచర్‌..

టీచర్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు