Updated : 16 Sep 2022 14:09 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

జ్ఞాపకశక్తి బాగా పెరిగిందిగా!

చింటు: అమ్మా..! నాకు జ్ఞాపకశక్తి పెరగడం కోసం నాన్న ఓ మందు తెచ్చారు కదా!
అమ్మ: అవును.. తెచ్చారు.. అయితే ఏంటి..? ఇప్పుడు దాన్ని తాగనంటావు.. అంతేగా! ఆ పప్పులేం ఉడకవు. అయినా నెల రోజులుగా తాగుతున్నావు కదా.. ఇప్పుడేమైంది నీకు?
చింటు: అయ్యో.. అమ్మా.. అది కాదు! ఆ మందు నిన్న ఎక్కడ పెట్టానో గుర్తుకు రావడం లేదు.
అమ్మ: ఆఁ!!

కాదా టీచర్‌!

టీచర్‌: మనల్ని అష్టకష్టాలు పెట్టే వాళ్లను ఏమంటారు?
పింకి: టీచర్లు అంటారు టీచర్‌!

మీరే చెప్పారని...

టీచర్‌: ఏంటి బంటీ..! స్కూలుకు ఇంత ఆలస్యంగా వచ్చావు?
బంటి: నిన్న మీరు ‘నిదానమే ప్రధానం’ అన్నారు కదా టీచర్‌.
టీచర్‌: ఆ.. అంటే!
బంటి: నిదానంగా నిద్రలేచి, నిదానంగా స్నానం చేసి, నిదానంగా నడుచుకుంటూ వచ్చేసరికి ఈ సమయమైంది టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని