నవ్వుల్‌.. నవ్వుల్‌...!

‘సత్యమేవ జయతే’ అన్నదెవరు? చింటూ నువ్వు చెప్పు..

Published : 28 Apr 2022 00:56 IST

నిజమే చెప్పానుగా టీచర్‌!

టీచర్‌: ‘సత్యమేవ జయతే’ అన్నదెవరు? చింటూ నువ్వు చెప్పు..
చింటు: ఇప్పుడు మీరే అన్నారు టీచర్‌.
టీచర్‌: ఆఁ!!

సరిపోయింది పో!

బంటి: ఎగ్జామ్స్‌ ఎలా రాశావు చంటీ?
చంటి: అంతా దేవుడి మీద భారం వేసి రాశా బంటీ! మరి నువ్వెలా రాశావు..?
బంటి: దేవుడి మీద భారం వేసిన వాడిమీద నమ్మకం పెట్టుకుని రాశా?
చంటి: అంటే ఏంటి.. నాకు అర్థం కాలేదు. వివరంగా చెప్పు.
బంటి: నేను నీ వెనకే కూర్చున్నా కదా... నువ్వు రాసేది చూస్తూ రాశా!
చంటి: ఆఁ!!

ప్రమాదం తప్పింది!

పింకి: అమ్మా.. గుడిలో ఎందుకు వంద కొబ్బరి కాయలు కొట్టావు?
అమ్మ: నువ్వు పాసైతే కొడతాను అని మొక్కుకున్నా...
పింకి: ఓహో.. అవునా.. మరి ఫెయిల్‌ అయితే ఏం చేస్తాను అని మొక్కుకున్నావు అమ్మా!
అమ్మ: నిన్ను కొడతాను అని పింకీ!
పింకి: అమ్మా రేపు మళ్లీ గుడికి వెళదాం.
అమ్మ: ఎందుకు?
పింకి: దెబ్బలు తప్పినందుకు.. ఈసారి నేను వంద కొబ్బరికాయలు కొడతాను!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని