నవ్వుల్‌.. నవ్వుల్‌...!

దానర్థం.. అనర్థం కాదా! టీచర్‌: ఏంటి బంటీ.. రాను రాను నీ మార్కులు మరీ ఇంతలా తగ్గిపోతున్నాయి?

Published : 29 Apr 2022 01:31 IST

దానర్థం.. అనర్థం కాదా!
టీచర్‌: ఏంటి బంటీ.. రాను రాను నీ మార్కులు మరీ ఇంతలా తగ్గిపోతున్నాయి?
బంటి: మీ వల్లే తగ్గిపోతున్నాయి టీచర్‌.
టీచర్‌: నా వల్ల నీ మార్కులు తగ్గిపోవడం ఏంటి బంటీ?

బంటి: ‘అతి అనర్థదాయకం’ అని మీరు మొదట్లో చెప్పారు కదా టీచర్‌.
టీచర్‌: ఆ చెప్పాను అయితే..

బంటి: మార్కులు కూడా అతిగా తెచ్చుకుంటే అనర్థమేమో అని...  
టీచర్‌: ఆఁ!!

నాకలా అర్థమైంది మరి!
నాన్న: ఏంటి చింటూ.. ఈ మధ్య మాటకు మాట ఎదురు చెబుతున్నావు?
చింటు: అలాగే ఉండాలని మా టీచర్‌ చెప్పారు.
నాన్న: అవునా.. అలా చెప్పారా?

చింటు: అవును నాన్నా.. అలానే చెప్పారు. ‘అతి వినయం ధూర్త లక్షణం’ అని.. అందుకే నేను మీకు ఎదురు చెబుతున్నాను.
నాన్న: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని