Published : 30 Apr 2022 01:06 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ఆలోచనే దండగ

టీచర్‌ : ఏంటి కమల్‌.. అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?

కమల్‌ : జీవితం గురించి టీచర్‌..

టీచర్‌ : ఇంతకీ ఏం అర్థమైంది మరి?

కమల్‌ : అనవసరంగా ఆలోచిస్తున్నానని..

టీచర్‌ : ఆ..!!

తప్పించుకోవాలని!

టీచర్‌ : రామూ.. అబద్ధాలు చెప్పడం ఇంకా మానలేదా నువ్వు?
రాము : లేదు టీచర్‌..

టీచర్‌ : ఏం.. ఎందుకు?
రాము : మీరు ప్రశ్నలు అడగటం, పరీక్షలు పెట్టడం ఎప్పుడు మానేస్తారో.. నేనూ అప్పుడే మానేస్తా టీచర్‌..

అదే మ్యాజిక్కు!

కిట్టు : నాన్నా నాన్నా.. ఆ దుకాణం వాళ్లు మనల్ని మోసం చేశారు..
నాన్న : ఏమైంది కిట్టూ..

కిట్టు : గ్రైండర్‌ ఆటోమేటిక్‌ అంటేనే మనం కొన్నాం కదా!
నాన్న : హ అవును..

కిట్టు : ఇప్పుడేమో.. మనమే పప్పు వేయాలట, నీళ్లూ పోయాలట. ఆఖరికి స్విచ్‌ కూడా మనమే ఆన్‌ చేయాలట...
నాన్న : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని