నవ్వుల్‌.. నవ్వుల్‌...!

ఏ రోజు పని ఆ రోజే చేయాలని మీరే అన్నారు కదా టీచర్‌. అందుకే మీరు నిన్న ఇచ్చిన హోం వర్క్‌.. ఈ రోజు చేయలేదు.

Updated : 01 May 2022 04:59 IST

ఏ రోజు పని ఆ రోజే!

టీచర్‌: ఈ రోజు హోం వర్క్‌ ఎందుకు చేయలేదు? 
పింకి:  ఏ రోజు పని ఆ రోజే చేయాలని మీరే అన్నారు కదా టీచర్‌. అందుకే మీరు నిన్న ఇచ్చిన హోం వర్క్‌.. ఈ రోజు చేయలేదు.
టీచర్‌: ఓహో.. అలాగా.. మరి నిన్న ఇచ్చిన హోం వర్క్‌ను, నిన్ననే పూర్తి చేసి ఉండొచ్చు కదా పింకీ!
పింకి: ‘వినదగు నెవ్వరు చెప్పిన.. వినినంతనె వేగపడక...’ అని మొన్న మీరు చెప్పింది మరిచిపోయారా టీచర్‌! 

నేనే.. అది నేనే!

అమ్మ: మొక్కలకు నీళ్లు పోశావా చింటూ? 
చింటు: ఆ పోశానమ్మా.. 
అమ్మ: అయ్యో.. అదేంటి మొక్కలన్నీ ఎవరో పీకేశారు?
చింటు: నేనే అమ్మా.. 
అమ్మ: ఎందుకు?
చింటు: నీళ్లు పోశాకదా.. వేళ్లు తడిచాయో లేదో అని చూశా.. 
అమ్మ: ఆఁ!!

జీవహింస అంటే... 

టీచర్‌: జీవహింస అంటే ఏంటో తెలుసా పింకీ?
పింకి: ఓ.. తెలుసు టీచర్‌. 
టీచర్‌: గుడ్‌.. పింకీ.. చెప్పుమరి. 
పింకి: పరీక్షలు, మార్కులు, హోంవర్క్‌ల పేరుతో.. టీచర్లు, స్టూడెంట్లను పెట్టే హింసనే జీవహింస అంటారు టీచర్‌.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని