నవ్వుల్‌.. నవ్వుల్‌..!

కారణం అదన్నమాట!పింకీ: టింకూ... సెల్‌ఫోన్‌కు ఆ పేరు ఎందుకు వచ్చిందో నీకు తెలుసా?

Published : 03 May 2022 01:08 IST

కారణం అదన్నమాట!

పింకీ: టింకూ... సెల్‌ఫోన్‌కు ఆ పేరు ఎందుకు వచ్చిందో నీకు తెలుసా?
టింకూ ఊహూ... నాకు తెలియదు. నీకు తెలిస్తే నువ్వే చెప్పు పింకీ.
పింకి: ఖైదీలను సెల్‌లో వేస్తారు కదా..
టింకూ ఆ.. వేస్తారు. అయితే!
పింకి: మనం కూడా ఫోన్లకు బందీలం కాబట్టి, దాన్ని సెల్‌ఫోన్‌ అని పిలుస్తారు.

అందరూ అందరే!

నాన్న: చింటూ.. మేకులు కొట్టాలి. పక్కింటి అంకుల్‌ను అడిగి సుత్తి తీసుకురావా?
చింటు: వెళ్లి అడిగాను నాన్నా.. లేదన్నారు.
నాన్న: అవునా.. అయితే ఎదురింటి అంకుల్‌ను అడిగి తీసుకురా పో...
చింటు: ఆ అంకుల్‌ను కూడా అడిగాను నాన్నా.. ఆయన కూడా లేదన్నారు.
నాన్న: అందరూ పిసినారులు తయారవుతున్నారు. ఉండి కూడా లేదంటున్నారు. సరే ఏం చేస్తాం.. మన ఇంట్లో ఉన్నదే పట్టుకురాపో.
చింటు: సరే నాన్నా!

మా మామయ్య ఏం చేస్తారంటే..

బంటి: మా మామయ్య రోజుకు కనీసం వంద మందికి అన్నంపెట్టి వాళ్ల ఆకలి తీరుస్తారు తెలుసా?
చంటి: ఓ.. గ్రేట్‌.. మీ మామయ్య ఏదైనా స్వచ్ఛంద సంస్థ తరఫున పని చేస్తున్నారా?
బంటి: లేదు.. మా మామయ్య ఓ హోటల్‌ నడుపుతున్నారు.
చంటి: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని