నవ్వుల్‌.. నవ్వుల్‌..!

చెప్పావో అంతే!టీచర్‌ : కిట్టూ.. యుద్ధాల వల్ల కలిగే నష్టాలేంటో చెప్పు..

Updated : 04 May 2022 06:59 IST

చెప్పావో అంతే!

టీచర్‌ : కిట్టూ.. యుద్ధాల వల్ల కలిగే నష్టాలేంటో చెప్పు..
కిట్టు  : ఇంట్లో జరిగే విషయాలు బయటకు చెబితే తాట వలిచేస్తానని మమ్మీ, వాతలు పెడతానని డాడీ వార్నింగ్‌ ఇచ్చారు టీచర్‌..
టీచర్‌ : ఆ..!!

భరించలేం బాబోయ్‌..

మావయ్య : విక్కీ.. ఏంటి ఇంటర్నెట్‌లో తెగ వెతుకుతున్నావు?
విక్కి    : ఎండలు మండిపోతున్నాయి కదా..
మావయ్య : నేను అడిగిందేంటి? నువ్వు చెబుతున్నదేంట్రా?
విక్కి    : అబ్బా.. ‘దీన్ని 10 మందికి పంపితే వర్షం కురుస్తుంది’, ‘ఈ ఫొటోని 20 గ్రూపుల్లో షేర్‌ చేస్తే, ఉక్కపోత తగ్గుతుంది’ అలాంటి మెసేజ్‌లు ఏమన్నా ఉన్నాయేమోననీ గూగుల్‌లో వెతుకుతున్నా మావయ్యా..

డిగ్రీల మీద డిగ్రీలు..

టీచర్‌ : ఏంటి వనజా.. అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
వనజ : మరేం లేదు టీచర్‌.. ఒక్క డిగ్రీనే ఎలా పూర్తి చేయాలోనని నేను బాధపడుతుంటే.. ఆ సూర్యుడేమో 40, 41, 42.. ఇలా రోజుకో డిగ్రీ ఎలా సాధిస్తున్నాడా అనీ..
టీచర్‌ :ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని