Published : 05 May 2022 01:06 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

భలే చిట్టి..

మావయ్య : చిట్టీ.. ఒక నంబర్‌ చెప్తాను కాస్త ఫోన్‌ చేసిపెట్టమ్మా..  
చిట్టి : ఒక నంబర్‌తో ఫోన్‌ ఎలా చేస్తారు మావయ్యా.. మిగతా తొమ్మిది కూడా చెప్పు..
మావయ్య : ఆ..!!

దెబ్బకి నిద్రొచ్చింది!

రింకి : అమ్మా అమ్మా.. నాకు నిద్రపట్టడం లేదు..
అమ్మ : అయితే, బ్యాగు తీసి హోంవర్క్‌ చేసుకో పో..
రింకి : అబ్బే.. ఏదో నిద్రమత్తులో అలా చెప్పానమ్మా.. అంతే..
అమ్మ : ఆ..!!

పంచ్‌కు పంచ్‌..

వినయ్‌ : మా అన్నయ్య మంచి యాక్టర్‌ తెలుసా?
ప్రణయ్‌ : అవునా.. ఎందులో చేస్తాడు?
వినయ్‌ : సోషల్‌ మీడియా రీల్స్‌లో..
ప్రణయ్‌ : మా అక్క మంచి స్పోర్ట్స్‌ పర్సన్‌ తెలుసా..
వినయ్‌ : నిజంగానా.. ఏ ఆటలో..?
ప్రణయ్‌ : ఆన్‌లైన్‌ గేమ్స్‌లో..

అలా అర్థమైందా!

మహి : ఏంటి రమా.. మీ మావయ్య హోటల్‌లో తినక, పార్సిళ్లు తీసుకెళ్తున్నాడు?
రమ : అదా.. మొన్న హాస్పిటల్‌కి వెళ్తే.. బయట వద్దు, ఇంట్లోనే తినమని చెప్పాడట డాక్టర్‌..
మహి : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని