నవ్వుల్‌.. నవ్వుల్‌...!

‘కష్టాలు ఆకాశం లాంటివి. అలాగే స్థిరంగా ఉంటాయి. వేసవి సెలవులు మాత్రం అతిథుల్లాంటివి. ఎప్పటికీ మనతోనే ఉండవు. ఉండవు గాక ఉండవు’ అని రాస్తున్నా అమ్మా.

Updated : 06 May 2022 06:22 IST

అవి అతిథుల్లాంటివి!

అమ్మ: ఏంటి టింకూ.. బుక్‌లో ఏదో కొటేషన్‌ రాస్తున్నావ్‌?
టింకు: ‘కష్టాలు ఆకాశం లాంటివి. అలాగే స్థిరంగా ఉంటాయి. వేసవి సెలవులు మాత్రం అతిథుల్లాంటివి. ఎప్పటికీ మనతోనే ఉండవు. ఉండవు గాక ఉండవు’ అని రాస్తున్నా అమ్మా.

అమ్మ: ఆఁ!!

పెద్దయ్యాక ఏం చేస్తానంటే...

టీచర్‌: బంటీ నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు?
బంటి: సైంటిస్టవుతా టీచర్‌.
టీచర్‌: గుడ్‌.. సైంటిస్టైన తర్వాత ఏం కనిపెడతావు?

బంటి: ఎక్కువ వేసవి సెలవులుండే క్యాలెండర్‌ కనిపెడతా టీచర్‌.

‘ఉత్తర’మెక్కడ?

టీచర్‌ :  టిల్లూ.. మన తరగతి గదికి తూర్పు ఇటు, పడమర అటు, దక్షిణం ఇటువైపు అయితే.. ఉత్తరం ఎక్కడ?
టిల్లు : పోస్టుమ్యాన్‌ దగ్గర టీచర్‌..
టీచర్‌ :  ఆ..!!

నాకర్థమైంది అంకుల్‌!

అంకుల్‌: ఏంటి చంటీ.. ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నావు?
చంటి: నాకో విషయం అర్థమైంది అంకుల్‌.
అంకుల్‌: ఏంటి చంటీ అది.

చంటి:  నాకింతవరకు ఏ విషయమూ పూర్తిగా అర్థం కాలేదు అని!
అంకుల్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని