Published : 10 May 2022 00:45 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

మమ్మల్నే చెప్పమంటున్నారు

కిట్టు: అమ్మా.. మాకు వెంటనే కొత్త టీచర్‌ కావాలి.
అమ్మ: ఎందుకు కిట్టూ..! ఇప్పుడు ఉన్న టీచర్‌ మానేస్తున్నారా?
కిట్టు: లేదమ్మా.. ఈ టీచర్‌కు అస్సలు ఏమీ ఆన్సర్లు రావడం లేదు. అన్ని ప్రశ్నలకు మమ్మల్నే సమాధానాలు చెప్పమంటున్నారు?

అమ్మ: ఆఁ!!

అస్సలు తెలియదు!

పింకి: చిన్నూ... నువ్వు సంధులు, సమాసాలు నేర్చుకున్నావా?
చిన్ను: లేదక్కా...
పింకి: ఎందుకు నేర్చుకోలేదు.

చిన్ను: నాకు మన వీధి సందు చివర అమ్మే సమోసాల గురించి తెలుసు కానీ, సంధులు, సమాసాల గురించి అస్సలు తెలియదు అక్కా!

నేనే దిద్దాను నాన్నా

నాన్న: బంటీ.. ఈ క్యాలెండర్‌పై స్కెచ్‌తో దిద్దింది నువ్వేనా?
బంటి: అవును నాన్నా.. నేనే సరిదిద్దాను?
నాన్న: సరిదిద్దావా...? అయినా.. అన్ని వారాలను ఎందుకిలా ఆదివారాలుగా రాశావు?

బంటి: వేసవి సెలవుల్లో నాకు ప్రతివారమూ ఆదివారమే కదా నాన్నా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని