Published : 13 May 2022 01:35 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..

అదీ సంగతి!

చంటి: నా బర్త్‌డే కోసం తెచ్చిన గిఫ్ట్‌ ఎక్కడ దాచావు నాన్నా..! ఇల్లంతా వెతికినా ఎక్కడా దొరకలేదు.
నాన్న: మళ్లీ వెతుకు.
చంటి: అబ్బా.. నాకిక ఓపిక లేదు నాన్నా... ఇప్పటికే మూడు సార్లు ఇల్లంతా జల్లెడ పట్టాను.
నాన్న: అవునా... నీ స్కూల్‌ బ్యాగులో వెతికావా?
చంటి: అయ్యో.. బ్యాగ్‌ తప్ప అంతా వెతికా నాన్నా...
నాన్న: హ..హ.. అందులోనే ఉంది పో.


సాయం చేశాను మరి!

నాన్న: చింటూ.. అమ్మకు ఇంటి పనిలో సాయం చేశావా?
చింటు: ఓ.. చేశా నాన్నా..
నాన్న: గుడ్‌.. ఇంతకీ ఏమేమి పనులు చేశావు చింటూ..
చింటు: నేను ఏ పనులూ చేయలేదు నాన్నా...
నాన్న: పనులేమీ చేయకుండా.. సాయం చేశా అని ఎలా చెబుతున్నావు మరి.
చింటు: బుద్ధిగా టీవీ చూశానంతే. అల్లరి చేయకుండా ఉండడమే నేను అమ్మకు చేసిన పెద్ద సాయం నాన్నా.
నాన్న: ఆఁ!!


అవును మరి...

టీచర్‌: చెరువులో ఈత కొట్టాలంటే రక్షణగా ఏం ఉండాలి?
చింటు: ముందు చెరువులో నీళ్లుండాలి టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని