నవ్వుల్‌... నవ్వుల్‌...!

అనిల్‌ : హలో అంకుల్‌.. సునీల్‌ ఉన్నాడా?

Published : 14 May 2022 00:09 IST

అలా అర్థమైందా?

అనిల్‌ : హలో అంకుల్‌.. సునీల్‌ ఉన్నాడా?
అంకుల్‌ : స్నానం చేస్తున్నాడు బాబూ.. నువ్వు.....?

అనిల్‌ :  నేను ఉదయాన్నే చేసేశా అంకుల్‌..
అంకుల్‌ : ఆ..!!

తగ్గేదే లే!

టీచర్‌ : టిల్లూ.. దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
టిల్లు : అవును టీచర్‌.. చంద్రుడి మీదకు వెళ్లిపోదామని అనుకుంటున్నా..

టీచర్‌ : ఏ.. ఎందుకలా?
టిల్లు : బరువు కాస్త తగ్గుదామనీ.. భూమి మీద కంటే అక్కడ తక్కువ బరువు ఉంటారని మీరే చెప్పారు కదా టీచర్‌..

అదీ సంగతి!

టీచర్‌ : వందనా.. ఈసారి నీకు మార్కులు బాగా వచ్చాయి. ఎప్పుడూ ఇలానే తెచ్చుకోవాలి. సరేనా?
వందన : తప్పకుండా టీచర్‌.. మీరు కొశ్చన్‌ పేపర్‌ని మా ఇంటి ముందున్న షాప్‌లోనే జిరాక్స్‌ తీయించాలి మరి..!

ఎంత శ్రద్ధో మరి..

టీచర్‌ : చింటూ.. నిన్న మీ ఇంట్లో దొంగలు పడ్డారట కదా?
చింటు : అవును టీచర్‌.. టీవీ తప్ప అన్నీ ఎత్తుకెళ్లిపోయారు..

టీచర్‌ : ఎందుకలా?
చింటు : అప్పుడు నేను టీవీ చూస్తున్నానని వదిలేసినట్టున్నారు టీచర్‌..
టీచర్‌ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని