నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అమ్మ: చిన్నీ... కాస్త పప్పు డబ్బా ఇటు తీసుకురా?

Published : 15 May 2022 02:13 IST

ఇంకా ఎన్ని రోజులు ఇలా?

అమ్మ: చిన్నీ... కాస్త పప్పు డబ్బా ఇటు తీసుకురా?
చిన్ని: అమ్మా.. ఇంకా ఎన్ని రోజులని నా మీద ఆధారపడతావు... నీ సొంత కాళ్ల మీద నువ్వు నిలబడలేవా? నీ పనులు నువ్వు సొంతంగా చేసుకోలేవా?
అమ్మ: ఆఁ!!


అదంతా నాకే కదా!

నాన్న: బంటీ.. నా పర్సులోంచి నువ్వు 100 రూపాయలు తీశావా?
బంటి: అవును తీశాను నాన్నా.
నాన్న: అడిగి తీసుకోవాలి అని తెలియదా?
బంటి: అదేంటి నాన్నా... ‘నేను సంపాదించేదంతా బంటీ కోసమే’ అని మొన్న అమ్మతో చెప్పారు. అదంతా నాదే అయినప్పుడు మళ్లీ మీ పర్మిషన్‌ ఎందుకు?
నాన్న: ఆఁ!!


మీరు చెప్పిందే చేశాగా!

టింకు: నాన్నా.. మీరు నిన్న చెప్పినట్లే.. ఈ రోజు కాసేపు ఆడుకున్నా, మరికాసేపు చదువుకున్నా తెలుసా?
నాన్న: గుడ్‌ బాయ్‌. ఇంతకీ ఎంతసేపు ఆడుకున్నావు? ఎంత సమయం చదువుకున్నావు?
టింకు: మూడు గంటలు ఆడుకున్నాను. మూడు నిమిషాలు చదువుకున్నా నాన్నా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని