Updated : 20 May 2022 04:49 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అంతేగా.. అంతేగా...!
రాజు: మేము ఓ పిల్లిని పెంచుకుంటున్నాం కదా..
రవి:  ఆఁ.. అవును.. పెంచుకుంటున్నారు..
రాజు: దానికి మాటలు వచ్చు తెలుసా?
రవి: ఓ అవునా.. గ్రేట్‌.. ఇంతకీ ఏం మాట్లాడుతుంది?
రాజు: మ్యావ్‌.. మ్యావ్‌.. అంటోంది.
రవి: ఆఁ!!
టింకూనా మజాకా!
టింకు: అంకుల్‌.. ప్యాంట్‌ కుడితే ఎంత?
అంకుల్‌: రెండు వందలు బాబు..
టింకు: నిక్కరు కుడితే ఎంత?
అంకుల్‌: వంద రూపాయలు..  
టింకు: అయితే.. నాకు నిక్కరే కుట్టండి అంకుల్‌.. కాకపోతే కాస్త పొడవు పెట్టండి.
అంకుల్‌: సరే బాబు.. పొడవు ఎక్కడి వరకు పెట్టమంటావ్‌?
టింకు: అరికాళ్ల వరకు అంకుల్‌..
అంకుల్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని