నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌ : చింటూ.. హరితో ఏదో గుసగుసలాడుతున్నావు ఏంటి?

Updated : 21 May 2022 06:36 IST

వందలో అంతుందా?

టీచర్‌ : చింటూ.. హరితో ఏదో గుసగుసలాడుతున్నావు ఏంటి?
చింటు : మరేం లేదు టీచర్‌.. ‘100’కి ఆ పేరు ఎలా వచ్చిందో చెబుతున్నాను..

టీచర్‌ : అవునా.. ఇంతకీ ఎలా వచ్చింది?
చింటు :  రెండు సున్నాలు ఒక దగ్గర చేరి.. దూరంగా ఉన్న ‘వన్‌’ని ‘దా’ అని పిలిచాయి.. ఆ ‘వన్‌ దా’ అనే పదం కాస్త ‘వంద’గా మారింది..

టీచర్‌ : ఆ..!!

అవి ఆనందభాష్పాలు...

అమ్మ : విన్నీ.. చెల్లిని ఏమన్నావు ఏడుస్తుంది?
విన్ని : అది ఏడుపు కాదమ్మా.. ఆనందంతో వచ్చే కన్నీళ్లు..

అమ్మ : నీకెలా తెలుసు?
విన్ని : ఇందాక నువ్విచ్చిన ఐస్‌క్రీమ్‌ తినడానికి చెల్లి కష్టపడుతుంటే.. సగం తిని సహాయం చేశా నేను.. ఆ ఆనందభాష్పాలే అవీ..

రైటే మరి!

టీచర్‌ : కిట్టూ.. క్లాసులో పిల్లలు ఎక్కువగా ఉపయోగించే పదం ఏంటో చెప్పు..
కిట్టు : నాకు తెలియదు టీచర్‌..
టీచర్‌ : వెరీ గుడ్‌.. కరెక్ట్‌ ఆన్సర్‌.. కూర్చో..

నిజమే కదా!

అంకుల్‌ : ఏంటి లిల్లీ.. డల్‌గా కూర్చున్నావు?
లిల్లి : మా కుక్కపిల్ల తప్పిపోయి నాలుగు రోజులైంది అంకుల్‌.. ఇంతవరకూ ఎలాంటి ఆచూకీ తెలియలేదు..

అంకుల్‌ : పేపర్‌లో యాడ్‌ ఇవ్వకపోయారా?
లిల్లి : దానికి చదవడం రాదు కదా అంకుల్‌..

అంకుల్‌ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని