నవ్వుల్‌.. నవ్వుల్‌..!

బంటి: నీకు కళ్లు మూసుకుని సంతకం పెట్టడం వచ్చా నాన్నా..? నాన్న: వచ్చు బంటీ.. ఇంతకీ ఎక్కడ సంతకం పెట్టాలి?

Published : 24 May 2022 00:29 IST

దటీజ్‌ బంటీ!

బంటి: నీకు కళ్లు మూసుకుని సంతకం పెట్టడం వచ్చా నాన్నా..?
నాన్న: వచ్చు బంటీ.. ఇంతకీ ఎక్కడ సంతకం పెట్టాలి?
బంటి: నా ప్రోగ్రెస్‌కార్డు మీద.
నాన్న: ఆఁ!!

అవును.. కానీ...

చంటి: మా నాన్న ఈ ప్రపంచంలో దేనికీ భయపడడు తెలుసా?
చింటు: మా డాడీ కూడా దేనికీ భయపడడు..
చంటి: అవునా?
చింటు: అవును.. కానీ..
చంటి: కానీ.. ఏంటో చెప్పు.
చింటు: ఒక్క మా అమ్మంటేనే భయం. ప్చ్‌.. గజగజా వణికిపోతాడు.

ఎంత అదృష్టమో...

పింకి: నా కన్నా మేం పెంచుకుంటున్న మా టామీ బతుకే బాగుంది.
రోజీ: అవునా.. ఎందుకు?
పింకి: అది రోజూ కడుపు నిండా తింటుంది. హాయిగా నిద్రపోతుంది. దానికి స్కూలు గొడవలేదు. హోంవర్క్‌ల గోల లేదు. అదృష్టం అంటే దానిదే.
రోజీ: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని