నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ఏంటి రింకీ.. కళ్లను పెద్దగా చేయడం ప్రాక్టీస్‌ చేస్తున్నావట?....

Published : 26 May 2022 00:27 IST

పెద్ద ప్లానే!

టీచర్‌ : ఏంటి రింకీ.. కళ్లను పెద్దగా చేయడం ప్రాక్టీస్‌ చేస్తున్నావట?
రింకి : కళ్లు కాదు టీచర్‌.. చూపు పెరిగేలా..  
టీచర్‌ : ఎందుకలా?
రింకి : పరీక్ష హాల్లో క్లాస్‌ టాపర్‌కు ఫస్ట్‌ బెంచీ పడింది. నాదేమో చివరి బెంచీ.. అంత దూరంలోని ఆన్సర్‌ షీట్‌ కనిపించాలంటే ఆమాత్రం ప్రాక్టీస్‌ చేయాలి కదా టీచర్‌..
టీచర్‌ : ఆ..!! 

అలా అర్థమైందా?

మావయ్య : రమా.. గోడ మీద ఏం రాస్తున్నావు?
రమా : మరేం లేదు మావయ్య.. ‘ఇచ్చట పోస్టర్లు అంటించరాదు’ అని రాసి ఉంది..
మావయ్య : అయితే..?
రమా : ‘నాకు అతికించడం వచ్చు’ అని రాస్తున్నా మావయ్య..

నిజమే సుమీ..

వందన : నందనా.. మీ తాతయ్యని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు కదా.. ఏమన్నారు డాక్టర్‌?
నందన : శరీరంలో కొన్ని విటమిన్లు తక్కువ ఉన్నాయని మందులు రాసిచ్చారు..
వందన : అదేంటి.. మీ తాతయ్య స్మార్ట్‌ఫోన్‌ వాడరా?
నందన : వాడరు.. దానికీ, దీనికీ ఏం సంబంధం?
వందన : మరేం లేదు.. ‘ఒక్క రోజు ఫోన్‌ వాడకపోతే ఆరోగ్యం బాగుండట్లేదు’ అని అంటుంటారు కదా.. అందులో అన్ని విటమిన్లూ ఉంటాయోమోననీ..
నందన : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని