Published : 27 May 2022 00:59 IST

నవ్వుల్‌..నవ్వుల్‌..!

వేదాంత్‌ వేదాంతం
అంకుల్‌ : ఏంటి వేదాంత్‌.. దిగాలుగా  కూర్చొని ఆలోచిస్తున్నావు?
వేదాంత్‌ : జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అంకుల్‌..
అంకుల్‌ : ఇప్పుడేమైందనీ.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు?
వేదాంత్‌ : అప్పుడే వేసవి సెలవులు అయిపో వస్తున్నాయనీ..
అంకుల్‌ : ఆ..!!

నేనే ఫస్ట్‌..
రిమ్మి : నాన్నా నాన్నా.. నేను ఫస్ట్‌ వచ్చాను తెలుసా?
నాన్న : వెరీ గుడ్‌ తల్లీ.. ఇంతకీ ఎందులో?
రిమ్మి: క్లాస్‌ నుంచి బయటకు వచ్చేయడంలో..
నాన్న : ఆ..!!

భలే ప్రాక్టీస్‌!
అమ్మ : చింటూ.. ఎందుకలా ఏడుస్తున్నావు?
చింటు : ఏడవట్లేదమ్మా.. ఏడుపు ప్రాక్టీస్‌ చేస్తున్నా..
అమ్మ : ఏ.. ఎందుకు?
చింటు : మీరెప్పుడైనా నేను అడిగింది కొనివ్వకపోతే ఏడ్వాలి కదా.. అందుకే నేర్చుకుంటున్నా..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు