నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అంకుల్‌ : ఏమైంది టింకూ.. ఎందుకు ఏడుస్తున్నావు?

Published : 28 May 2022 01:25 IST

తగ్గేదే లే!

అంకుల్‌ : ఏమైంది టింకూ.. ఎందుకు ఏడుస్తున్నావు?
టింకు : నిన్న డాక్టర్‌ దగ్గరికి వెళ్లి.. బ్లడ్‌ టెస్ట్‌ చేయించుకున్నా అంకుల్‌..

అంకుల్‌ : ఆ.. అయితే.. ఏం చెప్పారు?
టింకు : నా బ్లడ్‌ గ్రూప్‌ ‘బీ+’ అని చెప్పారు అంకుల్‌..

అంకుల్‌ : దానికి ఏడవటం ఎందుకు మరి?
టింకు : నాకు చిన్నప్పటి నుంచి అన్నిట్లో ‘ఎ+’ గ్రేడే వచ్చేది అంకుల్‌..

అవి కూడానా?

వ్యాపారి : పాతసామాన్లు కొంటాం.. పాతసామాన్లు కొంటాం..
లల్లి : అంకుల్‌ అంకుల్‌.. మా ఇంట్లో గత ఏడాది క్యాలెండర్లు ఉన్నాయి.. వాటిని కొంటారా.?
వ్యాపారి : ఆ..!!

తెలివైన ఆదా..

అమ్మ : ఏంట్రా రాజూ.. చదువుకోమంటే నిద్రపోతున్నావు?
రాజు : ‘కరెంటును ఆదా చేయాలి లేకపోతే తర్వాత దొరకదు’, ‘నీళ్లు ఆదా చేయాలి లేదంటే అన్నీ అయిపోతాయి’ - అని నాన్న నిన్న నీముందే చెప్పారు కదా!

అమ్మ : ఆ అయితే?
రాజు : అందుకే, చదువును కూడా ఆదా చేస్తున్నానమ్మా.. లేకపోతే రేపు చదవడానికి ఏమీ ఉండదు కదా..

అమ్మ : ఆ..!!

భలే సమాధానం!

టీచర్‌ : మాధురీ.. మతిమరుపుకి, జ్ఞాపకశక్తికి తేడా ఏంటో చెప్పు?
మాధురి : మనకు ఇవ్వాల్సింది గుర్తుకుపెట్టుకోవడం జ్ఞాపకశక్తి.. మనం ఇవ్వాల్సింది మరిచిపోవడం మతిమరుపు టీచర్‌..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని