నవ్వుల్‌.. నవ్వుల్‌...!

టీచర్‌: చెట్టు నుంచి యాపిల్‌ కిందపడితే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని న్యూటన్‌ కనిపెట్టాడు. బంటీ నువ్వే ఆ న్యూటన్‌ స్థానంలో ఉంటే ఏం చేసేవాడివి.

Published : 29 May 2022 00:32 IST

దటీజ్‌ బంటీ!

టీచర్‌: చెట్టు నుంచి యాపిల్‌ కిందపడితే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని న్యూటన్‌ కనిపెట్టాడు. బంటీ నువ్వే ఆ న్యూటన్‌ స్థానంలో ఉంటే ఏం చేసేవాడివి.
బంటి: వెంటనే ఆ పండు తినేసి, మరోటి ఎప్పుడు కింద పడుతుందా.. అని ఎదురు చూసేవాడిని టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


అదే పెద్ద సాయం!

టీచర్‌: పింకీ.. నువ్వు ఇంట్లో మీ అమ్మకు ఏమైనా సాయం చేస్తావా?
పింకి: ఓ.. చేస్తా టీచర్‌.
టీచర్‌: ఇంతకీ ఏం సాయం చేస్తావు పింకీ?
పింకి: ఇంట్లో ఉన్నప్పుడు రోజంతా టీవీ చూస్తా. అప్పుడు మా అమ్మ ప్రశాంతంగా ఇంటి పని చేసుకుంటుంది. అదే నేను మా అమ్మకు చేసే పెద్ద సాయం టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


అలా చెప్పమన్నారు మరి!

అంకుల్‌: చింటూ.. ఇంట్లో మీ నాన్న ఉన్నారా?
చింటు: మీరు మా నాన్నకు అప్పుంటే ఇంట్లో ఉన్నారు.. మీకు మా నాన్న అప్పుంటే ఇంట్లో లేరు.
అంకుల్‌: అదేంటి?
చింటు: నన్ను అలా చెప్పమన్నారు మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు