Published : 02 Jun 2022 01:05 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

మీరే చెప్పారని...

టీచర్‌: టింకూ... నేను క్లాస్‌ చెబుతుంటే నువ్వు నవ్వుతున్నావేంటి?
టింకు: నాకు నీరసంగా ఉంది టీచర్‌.
టీచర్‌: నీరసంగా ఉంటే ఎవరైనా నవ్వుతారా?
టింకు: నిన్న మీరే చెప్పారు కదా టీచర్‌.. సంతోషం సగం బలం అని.. అందుకే నవ్వుతున్నా.. సగం బలం వచ్చినా చాలు.. నీరసం కాస్తైనా తగ్గుతుందని!
టీచర్‌: ఆఁ!!

బంటీతో అట్లుంటది!

బంటి: అంకుల్‌... అరటి పండు ఎంతకు ఒకటి?
అంకుల్‌: ఒక్కోటి మూడు రూపాయలు బాబూ..
బంటి: రూపాయికిస్తారా అంకుల్‌?
అంకుల్‌: రూపాయికి తొక్క వస్తుంది.
బంటి: అయితే తొక్కలు మీరే ఉంచుకుని రెండు రూపాయలకొకటి చొప్పున ఓ పది అరటి పండ్లు ఇవ్వండి అంకుల్‌.
అంకుల్‌: ఆఁ!!

దూరం మారదు మరి..

మావయ్య : చింటూ.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ ఎంత దూరమో తెలుసా?
చింటు : ఆ.. తెలుసు మావయ్య..
మావయ్య : వెరీ గుడ్‌.. ఎంతో చెప్పు మరి!
చింటు : విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఎంత దూరమో.. హైదరాబాద్‌ నుంచి విజయవాడకూ అంతే దూరం..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని