నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ఏంటి చింటూ.. దిగాలుగా ఉన్నావు?...

Published : 07 Jun 2022 00:27 IST

ఎన్నెన్నో అనుకుంటాం..

అమ్మ: ఏంటి చింటూ.. దిగాలుగా ఉన్నావు?

చింటు: ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా.. ఏంటి?

అమ్మ: ఇంతకీ ఏమనుకున్నావు? ఏం జరగలేదు చింటూ!

చింటు: ఈ సారీ లాక్‌డౌన్‌ ఉంటుందని, ఆన్‌లైన్‌ క్లాసులే జరుగుతాయని!

అమ్మ: ఆఁ!!

అంతేగా.. అంతేగా..!

పింకీ: లల్లీ.. ఈ ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు ఇద్దరంటే ఇద్దరే బాధగా ఉన్నారు తెలుసా?

లల్లీ: అవునా.. ఎవరా ఇద్దరు?

పింకి: ఒకరు స్టూడెంట్‌. ఇంకొకరు ఐటీ ఉద్యోగి.

లల్లీ: ఏ.. ఎందుకు?

పింకి: వర్క్‌ఫ్రం హోం వద్దంటున్నారని ఐటీ ఎంప్లాయ్‌, ఆన్‌లైన్‌ క్లాసులు ఉండవని విద్యార్థి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని