నవ్వుల్‌.. నవ్వుల్‌..!

పింకీ: ఏంటి లిల్లీ.. అలా తుమ్ముతున్నావ్‌.

Published : 09 Jun 2022 00:12 IST

హాఁ.. హాఁచ్‌!

పింకీ: ఏంటి లిల్లీ.. అలా తుమ్ముతున్నావ్‌.
లిల్లి: స్కూళ్లు ప్రారంభం కాబోతున్నాయి కదా!

పింకీ: అవును.. అయితే!
లిల్లి: అప్పుడెప్పుడో పక్కన పడేసిన స్కూల్‌ బ్యాగ్‌ దుమ్ముదులిపే సరికి ఇదిగో ఇలా తుమ్ములు పట్టుకున్నాయి.

పింకీ: ఆఁ!!

అదన్నమాట అసలు విషయం!

నాన్న: ఏంటి చింటూ.. టీవీలో వార్తలు చూస్తూ సంతోషపడుతున్నావు?
చింటు: మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయంట నాన్నా.

నాన్న: అది బాధపడాల్సిన విషయం.. కదా.. మరి నువ్వేంటి ఆనందపడుతున్నావు?
చింటు: అంటే.. అదీ నాన్నా.. మళ్లీ మాకు ఆన్‌లైన్‌ క్లాసులు పెడతారు కదా.. అందుకని ఆ ఆనందం అన్నమాట.

నమ్మకద్రోహం అంటే..

టీచర్‌: నమ్మకద్రోహం అని దేన్నంటారు టింకూ!
టింకు: మాతోనే ఫీజుల కట్టించుకుని, మళ్లీ మమ్మల్నే మీరు తిడతారు, కొడతారు చూడండి టీచర్‌. దీన్నే నమ్మకద్రోహం అంటారు.

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని