Published : 10 Jun 2022 00:19 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ఊపిరాడదు మరి..

టీచర్‌ : చంటీ.. నువ్వెప్పుడైనా విమానం ఎక్కావా?
చంటి : లేదు టీచర్‌.. ఎక్కను కూడా..

టీచర్‌ : ఏం.. ఎందుకలా?
చంటి : ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కేటప్పుడు పెద్దగా, విశాలంగానే ఉంటుంది కానీ ఆకాశంలోకి ఎగిరాక చిన్నగా అయిపోతుంది కదా..
టీచర్‌ : అయితే?

చంటి : నాకు ఇరుకిరుగ్గా కూర్చోవడం నచ్చదు టీచర్‌..
టీచర్‌ : ఆఁ..!!

సూపర్‌ స్టార్‌!

అమ్మ : రిమ్మీ.. ఎందుకలా నవ్వుతూ పరుగెత్తుకుంటూ వస్తున్నావు?
రిమ్మి : మరేం లేదమ్మా.. మావయ్య వాళ్ల వైఫై పాస్‌వర్డ్‌ నాకు తెలిసిపోయిందిగా..

అమ్మ : అవునా.. నీకెలా తెలిసింది?
రిమ్మి : మావయ్య తన ఫోన్లో టైప్‌ చేస్తుంటే.. చాటుగా చూశానమ్మా..

అమ్మ : ఇంతకీ పాస్‌వర్డ్‌ ఏంటి?
రిమ్మి : ఆరు స్టార్లు..

అమ్మ : ఆఁ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని