నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నాన్న : ఏంట్రా కిట్టూ.. దిగులుగా ఉన్నావెందుకు?

Published : 11 Jun 2022 01:37 IST

చేతులు కాలాకే..

నాన్న : ఏంట్రా కిట్టూ.. దిగులుగా ఉన్నావెందుకు?

కిట్టు : పాత స్కూలే బాగుంది నాన్నా..

నాన్న : ఏడ్చీ ఏడ్చీ, పట్టుబట్టి మరీ నువ్వే మారావు కదా.. ఆ విషయం ముందు తెలియదా?

కిట్టు : నాకు కూడా కొత్త స్కూల్‌లో చేరాకే అర్థమైంది నాన్నా..


ఇదే ఆఖరు!

టీచర్‌ : లలితా.. పరీక్షలో ‘స్నేహితురాలికి ఉత్తరం’ బాగానే రాశావు కానీ.. చివర్లో ‘ఈసారైనా సమాధానం పంపు’ అని రాశావేంటి?

లలిత : మరేం లేదు టీచర్‌.. గతేడాది పరీక్షల్లో రాసిన ఉత్తరానికే, ఇంతవరకూ సమాధానం పంపలేదు తను..

టీచర్‌ : ఆ..!!


అదే బాగుంది..

బామ్మ : ఏంటి రవీ.. ఉదయం లేచిన దగ్గర్నుంచి, టీవీలో పదే పదే అవే వార్తలు చూస్తున్నావు?

రవి : కొద్దిరోజుల్లో బడులు తెరుస్తారు కదా..

బామ్మ : ఆ.. అయితే?

రవి : ఈలోగా కొత్త వైరస్‌ ఏదైనా వస్తుందేమో.. మళ్లీ ఆన్‌లైన్‌ క్లాసులేనని వార్తల్లో చెబుతారని చిన్న ఆశ బామ్మా..


నీకొచ్చా అసలు?

పింకి : రింకీ.. నీకు చెస్‌ ఆడటం వచ్చా?

రింకి : ఆ.. ఫర్వాలేదు. బాగానే వచ్చు..

పింకి : సరే పద.. గ్రౌండ్‌కు వెళ్లి అది ఆడుకుందాం..

రింకి : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని