నవ్వుల్.. నవ్వుల్..!
పక్కాగా ఉండాలిగా...
నాన్న: ఏంటి చింటూ... అలా డల్‌గా ఉన్నావు.
చింటు: ఏం లేదు నాన్నా.. ప్రాక్టీస్ చేస్తున్నా...
నాన్న: ఏం ప్రాక్టీస్ చేస్తున్నావు?
చింటు: స్కూళ్లు తెరుచుకోబోతున్నాయి కదా..
నాన్న: అవును.. అయితే..
చింటు: కడుపు నొప్పి, తలనొప్పి, కాలునొప్పి, విరేచనాలు, జ్వరం వచ్చినట్లు నటించడం ఎలాగో ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నా.. నాన్నా.
నాన్న: ఆఁ!!
విలీనం చేయాల్సిందే!
టీచర్: ఏంటి బంటీ.. అంత సీరియస్‌గా ఏదో ఆలోచిస్తున్నావు?
బంటి: మన దగ్గర కొన్ని బ్యాంకులను మరి కొన్ని బ్యాంకుల్లో విలీనం చేశారు కదా టీచర్?
టీచర్: గుడ్.. అవును బంటీ చేశారు.. అయితే..
బంటి: బ్యాంకులను విలీనం చేసినట్లే.. సబ్జెక్టులన్నింటినీ విలీనం చేసి.. ఒకే ఒక సబ్జెక్టుగా మారిస్తే బాగుంటుంది కదా అని...
టీచర్: ఆఁ!!
వేరు చేసి చూడొద్దు కదా!
టింకు: టీచర్.. పిల్లలందర్నీ సమానంగా చూడాలి కదా.. వేరు చేసి పక్షపాతం చూపించొద్దు కదా!
టీచర్: అవును టింకూ.. బాగా చెప్పావు.
టింకు: మరి పరీక్షలు పెట్టి.. పాసైన వాళ్లు, ఫెయిల్ అయిన వాళ్లు అని విభజించి, మా మీద ఎందుకు వివక్ష చూపిస్తున్నారు టీచర్.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ICC Rankings: కెరీర్లో అత్యుత్తమ రేటింగ్ పాయింట్లను అందుకున్న సూర్యకుమార్
-
India News
UPSC Jobs: యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ విడుదల.. పోస్టులెన్నంటే?
-
Politics News
Sajjala: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వాయిస్ రికార్డు అయితే, ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు: సజ్జల
-
Politics News
Chandrababu: వైకాపా 31 మంది ఎంపీలు ఏం సాధించారు?: బడ్జెట్‌పై స్పందించిన చంద్రబాబు
-
Sports News
Sports Budget: క్రీడల బడ్జెట్.. పెరిగింది కాస్తే కానీ.. ఇదే అత్యధికం!
-
Politics News
Harish rao: బడ్జెట్ 2023.. అందమైన మాటలు తప్ప కేటాయింపుల్లేని డొల్ల బడ్జెట్: హరీశ్‌రావు