Published : 13 Jun 2022 01:07 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అందుకే ఇలా...

టీచర్‌: ఏంటి టింకూ.. చొక్కాకు ఆ నల్లరిబ్బను?
టింకు: నిరసన టీచర్‌.. నిరసన..

టీచర్‌: నిరసనా.. ఎందుకు టింకూ?
టింకు: మీరు హోం వర్క్‌లు, క్లాస్‌ వర్క్‌లని మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు కదా.. అందుకే ఈ నిరసన టీచర్‌.
టీచర్‌: ఆఁ!!

పాయింటే సుమీ!

బంటి: టీచర్‌ మనిషి కోతి నుంచి వచ్చాడంటారు కదా.. అది నిజమా టీచర్‌?
టీచర్‌: అవును బంటీ.. నిజమే.

బంటి: మనిషి కోతి నుంచి వస్తే.. ఇప్పుడున్న కోతులన్నీ కోతులుగానే ఎందుకున్నాయి. అవి కూడా ఈ పాటికి మనుషులైపోవాలి కదా టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని