నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌ : చంటీ.. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల గురించి నీకేం తెలుసో చెప్పు?

Published : 16 Jun 2022 00:55 IST

కావాల్సింది సెలవు!

టీచర్‌ : చంటీ.. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల గురించి నీకేం తెలుసో చెప్పు?
చంటి : రెండూ సెలవు రోజుల్లోనే వస్తాయి టీచర్‌..
టీచర్‌ : ఆ..!!

అనుకున్నదొకటి..

టీచర్‌ : పిల్లలూ.. ‘అనుకున్నదొకటి.. అయ్యిందొకటి’ అని ఏ సందర్భంలో వాడుతుంటాం?
రమ్య : మనం అనుకున్నదానికి విరుద్ధంగా జరిగితే వాడతాం టీచర్‌..

టీచర్‌ : వెరీగుడ్‌.. దానికో ఉదాహరణ చెప్పగలవా?
రమ్య : ఫోర్త్‌ వేవ్‌ రాబోతుందనీ.. మళ్లీ ఆన్‌లైన్‌ క్లాసులేననీ అనుకున్నాం.. కానీ, దానికి భిన్నంగా యథావిధిగా పాఠశాలలు తెరిచారు టీచర్‌..

చాక్లెట్లు మరి...

బామ్మ : విన్నూ.. నా దగ్గరున్న ఆరు చాక్లెట్లలో నాలుగు నీకిచ్చేస్తే, ఇంకా ఎన్ని మిగులుతాయి?
విన్ను : సున్నా..

బామ్మ : అదేంటీ.. నా దగ్గర రెండు మిగులుతాయి కదా..!!
విన్ను : ఆ రెండు కూడా నేను లాగేసుకుంటే.. నీ దగ్గర మిగిలేది సున్నానే కదా..

బామ్మ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని