Published : 17 Jun 2022 00:59 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌...!

అంతేగా...

టీచర్‌ : పిల్లలూ.. సైక్లోన్‌ అంటే ఏంటో తెలుసా?
చిన్ను : నాకు తెలుసు టీచర్‌..

టీచర్‌ : వెరీగుడ్‌.. అందరికీ వినిపించేలా గట్టిగా చెప్పు..
చిన్ను : సైకిల్‌ కొనుక్కునేందుకు తీసుకునే లోన్‌ టీచర్‌..

టీచర్‌ : ఆ..!!

అలా అర్థమైందా?

హరి : ఏంటి గిరీ.. మీ ఇంట్లో వాళ్లంతా హడావిడిగా దేనికోసమో వెతుకుతున్నారు?
గిరి : మా మావయ్య కోసం..
హరి : ఎక్కడికెళ్లాడు మీ మావయ్య?
గిరి : డాక్టర్‌ రోజూ వాకింగ్‌ చేయమని చెప్పారట.. అలా అలా నడుచుకుంటూ ఎక్కడికో వెళ్లిపోయాడు మా మావయ్య..

కారణం కావాలి మరి!

అను : అమ్మా అమ్మా.. నేను ఈరోజు బడికి వెళ్లను..
అమ్మ : ఏ.. ఎందుకు?

అను : కాళ్లు బాగా నొప్పి పెడుతున్నాయమ్మా..
అమ్మ : రాత్రి వరకూ బాగానే ఉన్నావు కదా.. ఇంతలోనే ఏమైంది?

అను : కలలో చాలాసేపు సైకిల్‌ తొక్కానమ్మా..
అమ్మ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని