నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌ : విక్కీ.. ‘పరోపకారం’ అంటే ఏంటో తెలుసా?

Updated : 18 Jun 2022 06:52 IST

తెలిసిందే చెప్పాడు..

టీచర్‌ : విక్కీ.. ‘పరోపకారం’ అంటే ఏంటో తెలుసా?

విక్కి :  తెలుసు టీచర్‌..

టీచర్‌ : ఏంటో ఉదాహరణతో చెప్పు..
విక్కి : పరీక్షలో మనకు సమాధానాలు చూపించడాన్ని ‘పరోపకారం’ అనీ, ఆ చూపించే వ్యక్తిని ‘పరోపకారి’ అనీ పిలుస్తాం టీచర్‌..

టీచర్‌ : ఆఁ..!!

నా తప్పేం లేదు!

అంకుల్‌ : ఏ బాబూ.. రోడ్డు దాటుతూ ఫోన్‌ మాట్లాడకూదని తెలియదా?
బాబు : తెలుసు అంకుల్‌..

అంకుల్‌ : తెలిసీ ఎందుకు ఫోన్‌ చేశావు మరి?
బాబు : నేను చేయలేదు అంకుల్‌.. అవతలి వాళ్లు కాల్‌ చేస్తేనే మాట్లాడుతున్నాను..

అంకుల్‌ : ఆఁ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని