నవ్వుల్‌.. నవ్వుల్‌..!

బంటి: పదో తరగతి పాసైతే మా నాన్న సైకిల్‌ కొనిస్తా అన్నారు చింటూ.

Published : 22 Jun 2022 01:02 IST

నాన్నా.. మజాకా!

బంటి: పదో తరగతి పాసైతే మా నాన్న సైకిల్‌ కొనిస్తా అన్నారు చింటూ.
చింటు: అవునా.. మరి ఒక వేళ ఫెయిల్‌ అయితే...

బంటి: 100 సైకిళ్లు కొనిస్తా అన్నారు.
చింటు: వందా! అన్ని ఎందుకు?

బంటి: సైకిల్‌ షాప్‌ పెట్టించడం కోసం
చింటు: ఆఁ!!

అదన్నమాట అసలు విషయం!

టీచర్‌: ఏంటి కిట్టూ... మరీ అంత నెమ్మదిగా నడుస్తున్నావు?
కిట్టు: నిన్న మీరు తాబేలు గురించి పాఠం చెప్పారుగా.

టీచర్‌: చెబితే...
కిట్టు: తాబేళ్లు వందల ఏళ్లు బతుకుతాయన్నారుగా.. నేనూ ఎక్కువ సంవత్సరాలు బతకాలని వాటిలా నెమ్మదిగా నడుస్తున్నా టీచర్‌.

టీచర్‌: ఆఁ!!

దటీజ్‌ చంటీ!

అమ్మ: చంటీ.. నీకిచ్చిన ఇరవై రూపాయలేం చేశావు?
చంటి: పాపం.. ఎర్రటి ఎండలో, రోడ్డు మధ్యలో నిల్చుని అరుస్తున్న వ్యక్తికి ఇచ్చా అమ్మా.

అమ్మ: వెరీ గుడ్‌.. చంటీ! ఇంతకీ ఆ వ్యక్తి ఏమని అరిచాడు?
చంటి: ఐస్‌క్రీం.. ఐస్‌క్రీం.. అని అమ్మా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని