Published : 26 Jun 2022 01:27 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ఫోర్‌ కొట్టాల్సిందే..

కమల్‌ : అమ్మా అమ్మా.. నేను తమ్ముడితో కలిసి నిద్రపోనమ్మా..
అమ్మ : ఏమైంది?
కమల్‌ : మేమిద్దరం రోజూ క్రికెట్‌ ఆడుతున్నట్లు కలలొస్తున్నాయమ్మా..
అమ్మ : సరే.. అయితే, ఈరోజు నుంచి తమ్ముడిని బామ్మ దగ్గరకు పంపిస్తా..
కమల్‌ : ఈ రోజు వద్దమ్మా.. రేపటి నుంచి పంపించు..
అమ్మ : ఏ.. ఎందుకలా?
కమల్‌ : ఈ రోజు బ్యాటింగ్‌ నాదేనమ్మా..

మీకు శ్రమ ఎందుకని!

నాన్న: బంటీ.. ఏంటది చించేస్తున్నావు?
బంటి: నా ప్రోగ్రెస్‌ రిపోర్టు నాన్నా..
నాన్న: మరి ఎందుకలా చించుతున్నావు?
బంటి: నా మార్కులు చూస్తే ఎలాగూ మీరే చించుతారు! మీకా శ్రమ ఎందుకని నేనే ముక్కలు చేస్తున్నా నాన్నా!
నాన్న: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని