నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అమ్మ: ఏంటి టింకూ.. ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నావు?

Updated : 08 Jul 2022 06:50 IST

బాగుంటుంది కదా అని!

అమ్మ: ఏంటి టింకూ.. ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నావు?
టింకు: ఏం లేదు అమ్మా.. వేసవి కాలం సెలవుల మాదిరి, వర్షాకాలం సెలవులు కూడా ఉంటే ఎంత బాగుంటుందో కదా అని..

అమ్మ: ఆఁ!!

పడవ కోసం!

కిట్టు: నాన్నా.. నా బర్త్‌డేకు సైకిల్‌ కొనిస్తా అన్నావు కదా..
నాన్న: ఆ.. అన్నాను కిట్టూ..

కిట్టు: నాకు సైకిల్‌ వద్దు నాన్నా..
నాన్న: మరి..

కిట్టు: ఓ పడవ కొనివ్వు.. ఈ వర్షాకాలంలో రోజూ ఇంటి నుంచి బడికి వెళ్లివచ్చేందుకు సౌకర్యంగా ఉంటుంది నాన్నా..

నాన్న: ఆఁ!!

అవి లేకపోతేనే..

అంకుల్‌ : హిమజా.. నువ్వు రోజూ ఇంట్లో ఎంతసేపు చదువుతావు?
హిమజా: కచ్చితంగా గంటన్నర చదువుతా అంకుల్‌..

అంకుల్‌ : అవునా.. సరిగ్గా గంటన్నరనే ఎందుకు?
హిమజా: సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌కు గంట పడుతుంది.. మరో అరగంటేమో కరెంట్‌ ఉండదు. అంటే, మొత్తం కలిపి గంటన్నర చదువుతా అంకుల్‌..

అంకుల్‌ : ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని