Published : 09 Jul 2022 00:57 IST

నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నాకు తెలుసు.. నువ్వే!

నాన్న : రిత్విక్‌.. పోయిన వారమే చెప్పా కదా.. డబ్బులు అవసరమైతే అడగాలి కానీ ఇలా జేబులోంచి చెప్పకుండా తీసుకోవద్దని..
రిత్విక్‌ : అదేంటి నాన్నా.. ఎప్పుడూ నన్నే అనుమానిస్తారు? తమ్ముడు, చెల్లి కూడా ఉన్నారు కదా.. వాళ్లు తీశారేమో!

నాన్న : కచ్చితంగా వాళ్లిద్దరూ తీయలేదు..
రిత్విక్‌ : ఎలా చెప్పగలరు?

నాన్న : వాళ్లే అయితే, ఆ అయిదు వందల నోటు కూడా తీసుకునేవారు..

అదే ట్విస్టు..

హేమ : హిమా.. జూలో పనిచేసే మా మావయ్య, సింహం బోనులోకి కూడా ఒక్కరే వెళ్లిరాగలరు తెలుసా?
హిమ : అమ్మో.. మరి ఆయనకు సింహం అంటే భయం లేదా?

హేమ : ఎందుకు లేదు.. అందుకే కదా, బోనులో సింహం లేనప్పుడు మాత్రమే వెళ్లివస్తుంటారు..
హిమ : ఆ..!!

భలే చెప్పాడు..

టీచర్‌ : పవన్‌.. క్లాసు మొత్తంలో నువ్వొక్కడివే లెక్కల పరీక్షలో ఫెయిల్‌ అయ్యావు కదా.. కారణమేంటో తెలిసిందా?
పవన్‌ : నిన్నంతా దాని గురించే ఆలోచించా టీచర్‌..

టీచర్‌ : గుడ్‌.. ఏంటో చెప్పు?
పవన్‌ : అసలు మీరు పరీక్ష పెట్టడమే తప్పు టీచర్‌..

టీచర్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు